Breaking News

రేవంత్‌కు మాటలెక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు

Published on Wed, 11/20/2024 - 15:23

సాక్షి,మహబూబ్‌నగర్‌:రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకుడు ప్రజలను మోసం చేయకుండా చేయాలని కురుమూర్తి స్వామిని కోరుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం(నవంబర్‌ 20) హరీశ్‌రావు మహబూబ్‌నగర్‌లోని కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు.‘కురుమూర్తి స్వామి సాక్షిగా  ఇచ్చిన హామీని మరిచి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసగించారు.

రేవంత్‌రెడ్డికి పని తక్కువ మాటలెక్కువ. ఆయనకు సీఎం కేసీఆర్ భయం పట్టుకుంది. పాలకుడే మాటతప్పితే రాజ్యానికి అరిష్టం. రాష్ట్రంలో సగానికి పైగా మంది రైతులకు రుణమాఫీ చేయలేదు.వరంగల్  రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క గ్యారెంటీపైన  ప్రకటన చేయని సీఎం వరంగల్‌లో కేసీఆర్ మీద తిట్ల పురాణం పెట్టాడు. 

రేవంత్‌కు తెలిసింది ఒట్లు లేకుంటే తిట్లు. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారు. అబద్దాలు,మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. ప్రతిపక్షాల మీద పగ..రైతులు,ప్రజలకు దగా..తప్ప రేవంత్ చేసిందేమీ లేదు. రేవంత్‌రెడ్డి వచ్చాకా బీ ట్యాక్స్ వచ్చింది.బిల్లుల చెల్లింపులకు కమిషన్‌లు వసూలు చేస్తున్నారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రేవంత్‌ మెడలు వంచుతాం. ఏడాది పాలనలో ఒక్క ఇల్లు నిర్మించలేదు.మూడునాలుగు నెలలు పనులు చేయిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది.66 ఏళ్లు  కాంగ్రెస్‌, టీడీపీలు పాలమూరు జిల్లాను దగా చేశాయి. 

కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశాడు.గత పాలనలో ఇచ్చిన పథకాలను రేవంత్‌ ఎగ్గొడుతున్నాడు.కేసీఆర్ కలుపు మొక్కకాదు..కల్ప వృక్షం.రేవంత్‌రెడ్డి గురించి ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి.రియల్‌ఎస్టేట‌ను కుప్పకూల్చాడు’అని హరీశ్‌రావు ఫైరయ్యారు.

సీఎం రేవంత్ కు కేసీఆర్ భయం పట్టుకుంది: హరీష్ రావు
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)