Breaking News

ఎప్పుడూ అనుములే కాదు.. అన్నారం కూడా పట్టించుకోండి: కేటీఆర్‌

Published on Sat, 07/11/2026 - 13:38

సాక్షి, తెలంగాణభవన్‌: నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్‌ చేయకుండా రేవంత్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. సీఎం రేవంత్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు అని అన్నారు. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయవచ్చు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీల్లు లిఫ్ట్‌ చేయవచ్చు. గోదావరి బేసిన్‌లో 77 శాతం నీళ్లు లేవు. సీఎం రేవంత్‌ రెడ్డి బేషజాలకు పోతున్నారు. మేము కన్నెపల్లికి పోగానే సీఎం రేవంత్‌ రెడ్డికి కోపం వచ్చింది. గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని.. భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని అంటున్నారు. ఎల్‌నినో అంటూ రేవంత్‌ రెడ్డి తప్పించుకుంటున్నారు. సీఎం రేవంత్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎం బండారం బయటపడింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. రోజుకు 9 టీఎంసీల నీళ్లు కొందకు వృథాగా పోతున్నాయి. ఈ నీళ్లతో తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు నింపవచ్చు.

గేట్లు తెరిస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందని రేవంత్‌ అంటున్నారు. రేవంత్‌కు ప్రాజెక్ట్‌లపై అవగాహన తెచ్చుకోవాలి. గతంలో భారీ వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడింది. అన్నారం, సుందిళ్లకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్‌ చేయకుండా రేవంత్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు. వరదను తట్టుకని మేడిగడ్డ.. మేటిగడ్డగా నిలబడింది. కాళేశ్వరంపై బురద చల్లేందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై రేవంత్‌ అజ్ఞాన ప్రదర్శన చేశాడు.

మాపై కక్ష ఉంటే కేసులు.. కానీ, రైతులను పగబట్టకు. మీ రాజకీయం కోసం లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ, మన సీఎం మాత్రం సొంత రాష్ట్ర ప్రయోజనాలనే ఫణంగా పెడుతున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌పై ఒక్కనాడైనా సీఎం రేవంత్‌ రివ్యూ చేశారా?. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు. ఎప్పుడు అనుముల గురించే కాదు.. అన్నారం గురించి కూడా పట్టించుకోండి’ అంటూ కామెంట్స్‌ చేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)