Breaking News

మూసీ కాదు.. రేవంత్‌, మంత్రుల బుర్రలు ప్రక్షాళన కావాలి: జగదీష్‌ రెడ్డి

Published on Fri, 10/04/2024 - 18:09

సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి. ఇదే సమయంలో మంత్రుల వెనుక సీఎం రేవంత్ ఉండి ఇలా వారితో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు విఫలమై హైడ్రా.. అలాగే, హైడ్రా విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థాయిలేని వారికి మంత్రి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎవరో ఆకతాయిలు సోషల్‌ మీడియాలో చేసిన పనులకు కేటీఆర్‌కు ఏం సంబంధం ఉంది?. రేవంత్‌ వెనకుండి మంత్రులతో ఇలా మాట్లాడిస్తున్నారు. కొండా సురేఖ మాటలు సొంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయి. హామీల అమలులో విఫలమై కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. హామీలు విఫలమై హైడ్రాను ముందుకు తెచ్చారు. హైడ్రా కూడా విఫలం కావడంతో సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు.

రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. కేసీఆర్ కనపడటం లేదంటే కొండా మురళీ కనపడటంలేదని కొందరు మీమ్స్ పెడుతున్నారు. మనుషులను మాయం చేసే చరిత్ర మీది. చిల్లర మాటలు అనడం, అనిపించుకోవడం ఎందుకు. మంత్రి కోమటిరెడ్డి మానసిక స్థితి కూడా సరిగా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో మూసీ పరిస్థితిపై కోమటిరెడ్డి చర్చకు సిద్ధమా?. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్‌ పార్టీనే. మూసీ ప్రక్షాళన కాదు సీఎం, మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలి. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: మూసీకి కాసులు.. రైతులకు పైసల్లేవా?: రేవంత్‌కు కేటీఆర్‌ హెచ్చరిక

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య