Breaking News

‘ఫ్యూచర్‌ లేనిది ఫ్యూచర్‌ సిటీ.. గురు శిష్యులు ఒకే రైలులో వెళ్తారా?’

Published on Mon, 09/29/2025 - 12:28

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భవిష్యత్‌ ఆయనకే తెలియదు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ దందా నడుస్తోందన్నారు. ఇదే సమయంలో అమరావతికి రైలులో గురు శిష్యులు ఒకే రైలులో వెళ్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఫ్యూచర్‌ లేని సిటీ ఫ్యూచర్‌ సిటీ. హైదరాబాద్ మెట్రో వెనుక మతలబు ఉంది. వేయి కోట్ల రూపాయలు చేతులు మారాయి. 15వేల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై మోపారు. ఉన్న ఆర్టీసీనే నడపలేక పోతున్నారు. ఓ పథకం ప్రకారం ఎల్‌ అండ్‌ టీపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చారు. వేయి కోట్ల లాభం ముఖ్యమంత్రి పొందారు. హైదరాబాద్ మెట్రో ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. 35వేల కోట్ల రూపాయల ఆస్తులను ఆదాని, మెగాకి కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

మరో వేయి కోట్ల కోసం ప్రణాళిక రచిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ ఆయనకే తెలియదు. అమరావతికి రైలులో గురు శిష్యులు ఒకే రైలులో వెళ్తారా?. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ వచ్చాక ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఇల్లు లేని దగ్గర రోడ్లు వేయడం రేవంత్ మూర్ఖత్వమే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని ప్రజలు నమ్మడం లేదు. ప్రభుత్వంపై విశ్వాసం లేదు. బీసీ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి