Breaking News

బాబు పంపిందే రేవంత్‌ మాట్లాడుతున్నారు: జగదీష్‌రెడ్డి

Published on Tue, 07/15/2025 - 12:28

లేని గొప్పలు చెప్పుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని, తన గురురు చంద్రబాబు కోసం తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. తిరుమలగిరి సభలో సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ జగదీష్‌రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారాయన. 

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణకు రేవంత్‌ చేసింది ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటు. తిరుమలగిరి సభకు స్పందనే లేదు. అందుకే సీఎం ఆ సభలో బూతులు మొదలుపెట్టారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు అని జగదీష్‌ రెడ్డి అన్నారు. 

‘‘నీళ్ళ విషయంలో మరొక సారి రేవంత్ అజ్ఞానం బయటపడింది. ఏపీ సీఎం చంద్రబాబు పంపిన దానినే రేవంత్‌ మీడియా ముందు మాట్లాడుతున్నారు. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. గురుదక్షిణ కింద కృష్ణ, గోదావరి జలాలను  బాబుకు అప్పజెప్పబోతున్నారు. బనకచర్ల కోసం  మేడిగడ్డను గాలికి వదిలేస్తున్నారు’’ అని రేవంత్‌పై జగదీష్‌ మండిపడ్డారు. మేడి గడ్డ బ్యారేజీ, అన్నారం , సుందిల్ల నుండి బాహుబలి పంపు హౌస్ వరకు ఎక్కడైనా చర్చకు సిద్దం’’ అని సవాల్‌ చేశారు. 

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు  పంపిణీ చేశాం. మరి మా హయంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంప దెబ్బకు సిద్ధమా?. ఇప్పుడు ఎన్నికలు పెడితే నల్గొండలో 12 సీట్లకు 12 సీట్లు బీఆర్‌ఎస్‌ గెలుస్తుంది.

ధాన్యం ఉత్పత్తిలో నల్గొండ జిల్లాను దేశంలోనే నంబర్ వన్‌గా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ధాన్యం ఉత్పత్తిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల పెంచింది బిఆర్ఎస్ ప్రభుత్వమే. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీ లు, యాద్రాది టెంపుల్‌ అభివృద్ధి కేసీఆర్‌ హయాంలోనే జరిగాయి కదా. మరి సీఎంగా రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా?. నల్గొండ రైతులనే అడుగుదాం.. వారి  చెంప దెబ్బలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం రేవంత్‌, మంత్రులు అందుకు సిద్ధమేనా? అని జగదీష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. 

ఇక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విషయంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి అక్కర్లేదు. ఎవరికివారే సంస్కారం నేర్చుకుంటే మంచిది. సీఎం రేవంత్  కూడా విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోవాలి అని జగదీష్‌రెడ్డి హితవు పలికారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు