Breaking News

మాజీ మంత్రి హరీష్‌రావు, కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

Published on Thu, 12/05/2024 - 10:30

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మాజీ మంత్రి హరీష్‌ రావు, పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డిని బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్‌ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్‌ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్‌, జగదీష్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతారు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?.  

ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా?. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్‌ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు. ప్రజల తరఫున  పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’ అంటూ విమర్శలు చేశారు. 

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)