యువజన, విద్యార్థి సమ్మేళనాలపై ఫోకస్‌

Published on Thu, 04/20/2023 - 04:01

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌).. వాటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఉద్యమ సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న యువజన, విద్యార్థి వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక సమ్మేళనాలను నిర్వహించాలని భావిస్తోంది. విద్యార్థి, యువజన, ఉద్యోగ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని     బీజేపీ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ సమ్మేళనాల ద్వారా ఆయా వర్గాలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు ప్రణాళిక రూపొందించింది.

యువజన, విద్యార్థి సమ్మేళనాలతోపాటు వివిధ సామాజికవర్గాలతో ప్రత్యేక భేటీలు, సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఈ సమ్మేళనాలు, భేటీలకు సంబంధించిన షెడ్యూల్, విధి విధానాలను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇక పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియా కమిటీలను పటిష్టం చేయడంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

‘హైదరాబాద్‌ స్టేట్‌’ ప్రాంతాలపై నజర్‌
మహారాష్ట్రలో వరుస బహిరంగ సభలతో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై నెలకొన్న ఆసక్తిని అనువుగా మలుచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణతోపాటు పూర్వపు హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాల్లో బలం పెంచుకోవడంపై ఫోకస్‌ చేశారు. కనీసం 40 నుంచి 60 లోక్‌సభ నియోజకవర్గాల్లో అన్నిస్థాయిల్లో పార్టీ నిర్మాణం ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఈ నెల 25న రాష్ట్రంలోని 19వేల జనావాసాల్లో పార్టీ జెండా పండుగతోపాటు అదే రోజున అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 3వేల మందితో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)