కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ సిటీ ఎమ్మెల్యేలు

Published on Fri, 07/12/2024 - 03:50

సాక్షి, హైదరాబాద్‌:  బీఆర్‌­ఎస్‌కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) శుక్రవారం సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపా­యి. 

వారితోపాటు కొందరు మున్సిపల్‌ చైర్మన్లు కూడా తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ నుంచి ఏడుగురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్‌లో చేరగా.. ఈ ఇద్ద­రి చేరిక పూర్తయితే ఆ సంఖ్య తొమ్మిదికి చేరనుంది.

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే..
ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ ఇద్దరూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి.. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ బీఆర్‌ ఎస్‌ తరఫున ఎమ్మెల్యేలు­గా ఎన్నిక య్యారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు కూడా టీడీపీలో కొన సాగినకాలంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. 

మరోవైపు ఇటీవల ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు. ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ ఈ నెల ఏడున చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. తర్వాత వారం రోజుల లోపలే వారిద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)