Breaking News

సోయిలేకే మొదటి నుంచి తెలంగాణ ఆగం

Published on Fri, 07/05/2024 - 05:50

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడిరాష్ట్రంలో నాటి ఆంధ్రానాయకత్వ స్వార్థంతోపాటు, తెలంగాణ నాయకత్వం సోయిలేనితనం కారణంగానే రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం విద్యుత్, వ్యవసాయరంగంలో తెలంగాణకు ఉద్దేశపూరితంగా చేసిన ద్రోహాలు పసిగట్టంలో విఫలమైందన్నారు.

ఆ సమయంలో తెలంగాణ సమస్యలను కవులు, కళాకారులు సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలతో ఓ వైపు వ్యాప్తి చేయడం, మరోవైపు టీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రక్రియ.. జమిలిగా సాగిన భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సాధించామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కవితల పుస్తకాలు కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఇద్దరూ తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. శాంతియుత పద్ధతిలో సాగిన కేసీఆర్‌ ఉద్యమ ప్రస్థానం, పదేళ్లలో కేసీఆర్‌ పాలన ఆదర్శవంతంగా సాగిందని గోరటి తనదైన సాహిత్య శైలిలో వివరించారు.

ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన ‘పిట్ట వాలిన చెట్టు’పుస్తకాన్ని కేసీఆర్‌కు అందించారు. ఈ పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్‌ వర్దెల్లిని అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి