Breaking News

TS: గులాబీ బాస్‌ గ్రాండ్‌ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌

Published on Sat, 01/13/2024 - 21:06

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ వెంటనే తుంటి ఎముకకు సర్జరీతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ త్వరలో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17న తన పుట్టినరోజును పురస్కరించుకుని గులాబీ బాస్‌ మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పుట్టినరోజు నాడే కేసీఆర్‌ హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ స్టేట్‌ ఆఫీస్‌ తెలంగాణ భవన్‌కు రానున్నారని సమాచారం. 

బాస్‌ రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్‌ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. పుట్టినరోజు నాడు కేసీఆర్‌ తిరిగి తెలంగాణ భవన్‌కు రానుండటంతో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. బాస్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గ్రాండ్‌ రీ ఎంట్రీ తర్వాత  తొలుత సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు కేసీఆర్‌ భారీ కాన్వాయ్‌తో  వెళ్లనున్నారు. అక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌, గజ్వేల్‌ క్యాంప్‌ ఆఫీసు వేదికగా కేసీఆర్‌ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. 

తాను త్వరలో అందుబాటులో ఉంటానని కేసీఆర్‌ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే వరంగల్‌లో  భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ నేతల సిద్ధమవుతున్నారు. 

ఇటీవల వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ రీ ఎంట్రీపై హింట్‌ ఇచ్చారు. త్వరలో కేసీఆర్‌ తెలంగాణభవన్‌లో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు కూడా వెళ్తారని వెల్లడించారు. 

తుంటి ఎముకకు సర్జరీ కారణంగా ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీంతో రీ ఎంట్రీలో కొత్త ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.  

ఇదీచదవండి.. మేమూ రామ భక్తులమే : మంత్రి ఉత్తమ్‌ 

 
  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)