Breaking News

బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది

Published on Wed, 10/16/2024 - 17:57

సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌. బుధవారం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఉల్లంగిస్తే చర్యలు తప్పవు. ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్‌లో పని చేయాల్సిందేనని ఆదేశించారు.  

రాబోయే గ్రేటర్  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసింది. కానీ కాంగ్రెస్‌ అలా కాదు.. అధికారంలోకి వచ్చాక 10 నెలల కాలంలో అనేక అద్భుతమైన పనులు చేసింది.. అటు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చింది.  

గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి.  మనం గట్టిగా పనిచేస్తేనే ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం చేస్తున్న పనులను నాయకులు లోతుగా అధ్యయనం చేయాలి.. అర్థం చేసుకోవాలి. ప్రజల్లో మంచి స్పందన ఉంది.

ప్రతి పక్ష బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పోయాయి.. రెండు పార్టీ లు కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కుట్రల్ని మనం తిప్పికొట్టారు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున గ్రేటర్ లో విజయం సాధిస్తేనే మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ జిల్లా నాయకులు పకడ్బందీగా పని చేసి ఫలితాలు సాధించాలి’అని  బి.మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)