Breaking News

మండలి ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరం!

Published on Fri, 02/07/2025 - 04:54

సాక్షి, హైదరాబాద్‌:  శాసన మండలిలోని మూడు స్థానాలకు ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య నేతలకు స్పష్టత ఇచ్చారు. పట్టభద్రుల కోటా స్థానంలో పోటీ చేయాలని పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనను కేసీఆర్‌ తిరస్కరించారు. పట్టభద్రుల కోటాలో పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నేతలకు ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా కీలక నేతలకు సూచించారు.

అదే సమయంలో మండలి ఎన్నికల్లో ఇతర పార్టీలు లేదా అభ్యర్థులెవరికీ మద్దతు ఇవ్వ డం లేదనే సంకేతాలు కూడా ఇచ్చారు. శాసన మండలి ఎన్ని కలకు బదులు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సన్నాహాలు ప్రారంభించాలని పార్టీ శ్రేణులను కేసీఆర్‌ ఆదేశించారు.  

ఇక స్థానిక ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు.. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ నిర్వహణపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. 

పోటీకి నేతలు సిద్ధమైనా.. 
శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ కోటా స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు ఆశావహులు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దా ర్‌ రవీందర్‌సింగ్, డాక్టర్‌ బీఎన్‌ రావు, శేఖర్‌రావు, రాజారాం యాదవ్‌ తదితరుల పేర్లు వినిపించాయి.

పట్టభద్రుల కోటా లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేందర్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని టికెట్‌ ఇవ్వాలని ఓ దశలో ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీకి సన్నద్ధమవుతున్న ప్రసన్న హరికృష్ణను బీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చి పార్టీ టికెట్‌ ఇప్పించేందుకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కొంతమేర ప్రయత్నాలు కూడా  చేశారు. 

కానీ చివరికి పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు తిరిగి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్‌ చేయనున్నారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)