Breaking News

బీజేపీలో చికోటి చేరికకు బ్రేకులు

Published on Tue, 09/12/2023 - 19:28

సాక్షి, హైదరాబాద్‌: చికోటి ప్రవీణ్‌ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలోకి చేరడానికి మంగళవారం.. పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి కర్మన్‌ఘాట్‌ నుంచి నాంపల్లి వరకు చికోటి భారీగా ర్యాలీగా వెళ్లారు. కానీ చివరి నిముషంలో బీజేపీలో చేరికకు ప్రవీణ్‌కు బ్రేకులు పడ్డాయి.

రేపు దీక్ష కారణంగా సీనియర్లు అందుబాటులో లేరని బీజేపీ కార్యాలయం సిబ్బంది చెప్పడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ పట్ల అభిమానంతో వచ్చానన్న చికోటి.. మిస్‌ కమ్యూనికేషన్‌ ఉండొచ్చన్నారు. జాతీయ నేతలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కూడా విచారించింది. కాగా, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి.
చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు? 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)