Breaking News

కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. బీజేపీలో చేరిన బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌

Published on Wed, 04/03/2024 - 15:26

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. ప్రముఖ భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు

కాగా  2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు విజేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం పార్టీ అధిష్టానం ఈ యువ బాక్సర్‌ను దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు.

అయితే  ఈ సారి విజేందర్‌ను సింగ్‌ దక్షిణ ఢిల్లీ నుంచి కాకుండా ఉత్తర్‌ ప్రదేశ్లోని  మధుర లోక్‌సభ అభ్యర్ధిగా బరిలోకి దించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ బీజేపీలో చేరడంతో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 

ఇక మధుర  నుంచి  నుంచి బీజేపీ తరపున నటి హేమమాలని పోటీ చేస్తున్నారు. ఇప‍్పటికే ఆమె 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. అయితే హేమమాలినికి చెక్‌ పెట్టేందుకు జాట్‌ వర్గం ప్రభావం ఎక్కువ ఉండి, అదే వర్గానికి చెందిన విజేందర్‌ను లోక్‌సభ అభ్యర్ధిగా దించాలని కాంగ్రెస్‌ పెద్దలు భావించారు. కానీ అనూహ్యంగా విజేందర్‌ సింగ్‌ బీజేపీలో చేరడం ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. జాట్‌ వర్గం ప్రభావం ఎక్కువగా చూపే  హర్యానా, పశ్చిమ యూపీలలో బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)