Breaking News

విజయం వైఎస్సార్‌సీపీదే.. టీడీపీ బలం 200 మాత్రమే: బొత్స సత్యనారాయణ

Published on Fri, 08/09/2024 - 19:39

సాక్షి, అనకాపల్లి: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది.. తప్పకుండా విజయం సాధిసస్తామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు.

కాగా, వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు శుక్రవారం అనకాపల్లిలోని ఎలమంచిలిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. టీడీపీ కంటే 400 ఓట్లు అధికంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీకి 620 పైగా ఓట్లు ఉన్నాయి. టీడీపీకి 200 ఓట్లు బలం మాత్రమే ఉంది. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే వైఎస్సార్‌సీపీ పోటీ నుంచి తప్పుకుంది. గత సాంప్రదాయానికి విరుద్ధంగా చంద్రబాబు పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. పెన్షన్ తప్పితే ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు.

👉మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. టీడీపీకి బలం లేకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

👉మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ..‘బొత్స సత్యనారాయణ ఎన్నో గొప్ప పదవులు చేశారు. ఎమ్మెల్సీ అనేది ఆయనకు పెద్ద పదవి కాదు. చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగట్టేందుకు మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఫలితం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించడానికి కేఏ పాల్ తప్పితే అందరూ ఏకమయ్యారు. బొత్సను గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యల మీదనే కాదు రాష్ట్ర స్థాయి సమస్యల మీద కూడా పోరాటం చేస్తారు’ అని కామెంట్స్‌ చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)