Breaking News

పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా?

Published on Fri, 03/15/2024 - 07:29

సాక్షి, భువనేశ్వర్‌ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం.   

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు. 

అమిత్‌ షా తో సుదీర్ఘంగా చర్చలు 
ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్‌ సాముల్‌.. కేంద్రమంత్రి అమిత్‌ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.   

చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్‌ సాముల్‌ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు. 

సీనియర్‌ నేతలతో సీఎం భేటీ
ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్‌.కామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. మరోవైపు  బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. 

ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్‌కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం.  
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)