Breaking News

అదే జరిగితే బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనే.. సువేందు అధికారి హెచ్చరిక

Published on Fri, 10/17/2025 - 10:49

జల్పాయ్‌గురి: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికలతో ప్రభుత్వం మారనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి జోస్యం చెప్పారు. సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.

జల్పాయ్‌గురి జిల్లా నగ్రాకటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఎన్నికలు జరగవన్నారు. ‘వచ్చే ఏడాది మే 4వ తేదీకల్లా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఎన్నికల ముందు సెమీఫైనల్స్‌ వంటిది. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదు’ అని సువేందు వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు పొందిన ఓట్లలో తేడా 42 లక్షలు మాత్రమే. అప్పట్లో అక్రమంగా చేర్చిన 2.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎస్‌ఐఆర్‌లో తొలగిస్తారు. అక్రమ వలసదారులు, ఇతరత్రా అనర్హుల పేర్లు సైతం ఉండవు. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీకి తన చేతిలో ఓటమి తప్పదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)