Breaking News

కేజ్రీవాల్‌కు నోబెల్‌ ఇవ్వాల్సిందే.. ఏ కేటగిరి అంటే.. బీజేపీ సెటైర్లు

Published on Thu, 07/10/2025 - 08:17

న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హోదాలో వీకే సక్సెనా తరచూ తమ పరిపాలనకు అడ్డు తగులుతున్నాసరే విజయవంతంగా ప్రభుత్వపాలన కొనసాగించినందుకుగాను తాను కూడా నోబెల్‌ బహుమతికి అర్హుడినేనని ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. అవినీతి, అసమర్థత కేటగిరిలో నోబెల్‌ ఉంటే కేజ్రీవాల్‌కు అవార్డు వచ్చేందని బీజేపీ నేతలు సెటైర్లు వేశారు.

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నోబెల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. అసమర్థత, అరాచకం, అవినీతికి సంబంధించిన కేటగిరిలో నోబెల్‌ ఉండి ఉంటే.. ఆయనకు ఖచ్చితంగా ఒక అవార్డు లభించేది అని కౌంటరిచ్చారు. ఇదే సమయంలో ఆప్ పాలనలో జరిగిన అక్రమాలను ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సులలో పానిక్ బటన్లు, తరగతి గది నిర్మాణం, మహిళలకు పెన్షన్ పథకాలు, మద్యం లైసెన్సింగ్,  షీష్ మహల్ గురించి వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. బీజేపీ నేత వ్యాఖ్యలకు ఆప్‌ నేతలు తిరిగి కౌంటరిచ్చారు. సచ్‌దేవా వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ..‘వీరేంద్ర సచ్‌దేవా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. కేవలం మాట్లాడటం కాదు. పరిపాలన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతిపక్షాల రోజులు ముగిశాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఆప్‌ హయాంలో పాఠశాలలు నిర్మించాం. ఆసుపత్రుల్లో వసతులను మెరుచుపరిచాం. ఉచిత విద్యుత్‌ ఇచ్చాం. అవినీతిని అరికట్టాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులే దోచుకుంటున్నారు’ అని ఆరోపించారు.

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. అంతకుముందు పంజాబ్‌లోని మొహాలిలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉన్నంత కాలం పని చేయడానికి అనుమతించనప్పటికీ మేం పనిచేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీలో చేసిన పనులు, పరిపాలనకు నోబెల్ బహుమతి పొందాలని నేను భావిస్తున్నాను. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అరవింద్‌ కేజ్రీవాల్‌ మడిపడ్దారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆప్‌ పథకాలు గాడితప్పేలా వ్యవహరించారని విమర్శించారు. ‘ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌లను ఆప్‌ నిర్మించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులు తమ బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్‌కు బుల్డోజర్లను పంపి ఐదు మొహల్లా క్లినిక్‌లను కూల్చివేశారు. వారికి ఏం లభించింది? మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ప్రభుత్వ మొహల్లా క్లినిక్‌లను కూల్చివేసింది’ అని అన్నారు.

మరోవైపు దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లో ఢిల్లీలో పరిస్థితి దిగజారిందని అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. మొహల్లా క్లినిక్‌లను మూసివేశారని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల ఉచిత నీరును తమ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ పథకాలు గాడితప్పడంతో ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రాముఖ్యతను గ్రహిస్తున్నారని అన్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు