Breaking News

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Published on Wed, 02/14/2024 - 15:04

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రా​ల్లో బీజేబీ 12 మందితో  రాజ్యసభ అభ్యర్థుల జాబితాను రిలీజ్‌ చేసింది. గుజరాత్‌ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్‌ను నలుగురు, ఒడిషా నుంచి  ఒకరిని అభ్యర్థులుగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. 

గుజరాత్‌ నుంచి జేపీ నడ్డా, గోవింద్‌భాయ్‌ డోలాకియా, మయాంక్‌భాయ్‌ నాయక్‌, శ్వంత్‌సిన్హ్ జలంసింహ పర్మార్‌లను ఎంపిక చేయగా.. మహారాష్ట్ర నుంచి అశోక్‌ చవాన్‌, మేధా కుల్‌కర్ణీ, అజిత్ గోప్‌చాడేలతోమ కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. అదేవిధంగా మధ్యప్రదేశ్‌ నుంచి  డా. ఎల్‌. మురుగన్‌, ఉమేష్‌నాథ్‌ మహారాజ్‌, బన్సిలాల్‌ గుర్‌జార్‌, మాయా నరోలియాలను ఎంపిక చేశారు.

ఓడిశా నుంచి అశ్వీణీ వైష్ణవ్‌కు మరోసారి బీజేపీ అవకాశం కల్పించింది. ఇక..మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం బీజేపీలో చేరిన మాజీ సీఎం అశోక్ చౌహన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం గమనార్హం.

గత ఆదివారం రాజ్యసభకు 14 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి విడత జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదిటి విడతలో ఉత్తరప్రదేశ్(7), బిహార్‌(2), చత్తీస్‌ఘఢ్‌(1), హర్యానా(1), కర్ణాటక(1), ఉత్తరాఖండ్‌(1), పశ్చిమ బెంగాల్‌(1) చొప్పున అభ్యర్థులను బీజేపీ జాబితా విడుదల చేసింది. ఇక.. 15 రాష్ట్రాల్లో ఏప్రిల్‌తో 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 


 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు