‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌కు రెబల్‌గా మారనుంది’

Published on Sat, 05/04/2024 - 11:03

లోక్‌సభ ఎ‍న్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని రెండు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన ఆమేథీ, రాయ్‌బరేలీలో అభ్యర్థులను శుక్రవారం ప్రకటించటంతో సస్పెన్షన్‌ వీడింది.  ఆమేథీలో కిషోరీ లాల్‌ శర్మ, రాయ్‌ బరేలీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని  పార్టీ అధిష్టానం బరిలోకి దించటంతో వారు నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆమేథీ స్థానం విషయంలో బీజేపీ.. రాహుల్‌ గాంధీ క్యాంప్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాహుల్‌ గాంధీ క్యాంప్‌..  ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రాలను కావాలనే కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేసిందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది.

‘ఆమేథీలో ఎంతో ప్రజాదరణ ఉన్న రాబర్ట్‌ వాద్రాను ఆ స్థానం నుంచి కావాలనే పక్కకు తప్పించారు. ఇది ఖచ్చితంగా రాహుల్‌ గాంధీ క్యాంప్‌ చేసిన పనే. తర్వలో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా కాంగ్రెస్ నాయకత్వానికి రెబల్‌గా మారుతారు’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ‘ఎక్స్‌’ వేదికగా అన్నారు.

ఇటీవల రాబర్ట్‌ వాద్రా తనకు ఆమేథీలో ప్రజాధారణ ఉందని పేర్కొన్నారు.   అదీ కాక.. తాను క్రియాశీల రాజకీయాల్లో​కి రావాలని దేశంలో కోరుకుంటోందని తెలిపారు. తాను మార్పు తీసుకురాగలనని కాంగ్రెస్‌ భావిస్తే.. రాజకీయాల్లోకి వస్తాను. తాను ఆమేథీలోనే పోటీ చేయాలని లేదు.. మొరాదాబాద్‌, హర్యానాలో కూడా పోటీ చేస్తానన్నారు. ఇక.. రాబర్ట్‌ వాద్రా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌ కంచుకోట స్థానమైన ఆమేథీ సీటు ఆశించినట్లు పరోక్షంగా వెల్లడి అయింది.

మూడు పర్యాయాలు రాహుల్‌గాంధీ ఆమేథీ స్థానంలో అనూహ్యంగా 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే మరో నియోజకవర్గంలో కేరళలోని వాయ్‌నాడ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే.  2019లో రాయ్‌బరేలీలో విజయం సాధించిన సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపిక కావటంతో ఆ స్థానంలో అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్‌ గాంధీ బరిలోకి దిగారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)