Breaking News

ఎన్నికల్లో గెలవాలనే అందర్నీ జైలుకు పంపుతోంది: మమత

Published on Fri, 02/02/2024 - 08:45

కోల్‌కతా: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలందరినీ జైళ్లకు పంపుతోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక వేళ తనను జైలుకు పంపినా బయటకు రాగలనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు తమ టీఎంసీ పార్టీ ఆసక్తి చూపినా ఆ పార్టీ తిరస్కరించిందన్నారు. 

కాగా మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు.

రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్‌ ఆధీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్‌ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)