Breaking News

మణిపూర్‌పై బిగ్‌ ట్విస్ట్‌.. మోదీ నిర్ణయం అదేనా?

Published on Wed, 02/12/2025 - 09:31

ఇంపాల్‌: మణిపూర్‌ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పెరిగింది. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై బీజేపీ నేతల నుంచి ఎలాంటి కామెంట్స్‌ వినిపించకపోడం గమనార్హం.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లా తదుపరి నియామకం జరిగే వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించాలని బీరేన్‌ను కోరారు. అయితే రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్‌ పంపిన నివేదికలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరినట్టు తెలిసింది.

ఇక, సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్‌ సింగ్‌ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ రెండు సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ అంతరం ఉండకూడదు.. కానీ మణిపూర్ అసెంబ్లీ సందర్భంలో ఈ రాజ్యాంగ కాలపరిమితి నేటితో (బుధవారం) ముగుస్తుంది.

అయితే, రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య గరిష్టంగా 6 నెలల అంతరానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు 6 నెలల తర్వాత అసెంబ్లీని రద్దు చేయాలని స్పష్టంగా పేర్కొనలేదని కూడా వర్గాలు పేర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను అన్వేషించే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)