Breaking News

బీజేపీ కీలక సమావేశం.. ఉపరాష్ట్రపతి రేసులో రాజ్‌నాథ్‌, లక్ష్మణ్‌..

Published on Sun, 08/17/2025 - 11:46

సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికపై అధికా­ర బీజేపీ దృష్టి పెట్టింది. తమ అభ్యర్థిని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆ­ది­వారం భేటీ కానుంది. సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతలను ఎన్డీయే అప్పగించింది. పార్టీ అభ్యర్థి పేరుపై ఈ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించా­యి. ఆగస్టు 4న ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆకస్మికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అభ్యర్థి ఎంపిక పరిశీలనలో పేర్లు ఇవే..
ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పరిశీలనలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జ​మ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత, ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రి చారి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. 

సెప్టెంబర్‌ 9న కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగియనుంది. లోక్‌సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 781 మంది సభ్యులు కలిగిన ఎలక్టోరల్‌ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో నెగ్గాలంటే కనీసం 391 ఓట్లు అవసరం. 422 మంది ఎంపీ­ల బలం కలిగిన అధికార ఎన్డీయేకు స్పష్ట­మైన విజయావకాశాలు ఉన్నాయి. మరోవైపు విపక్ష ‘ఇండియా’ కూటమి సైతం తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)