Breaking News

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌కి మరోసారి జాక్‌పాట్‌!

Published on Mon, 03/04/2024 - 15:32

రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను భారతీయ జనతా పార్టీ వరుసగా మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానానికి ఆయన పోటీ చేయడం ఇది వరుసగా నాలుగోసారి. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత బికనీర్ చేరుకున్న మేఘ్‌వాల్‌కు పార్టీ మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు.

మేఘ్వాల్ 2009లో తొలిసారిగా బికనీర్ నియోజకవర్గం నుండి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు . 2019 లోక్‌సభ ఎన్నికల్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ తన బంధువు, కాంగ్రెస్ నాయకుడు మదన్ గోపాల్ మేఘ్‌వాల్‌ను ఓడించి బికనీర్ స్థానాన్ని గెలుచుకున్నారు . తనపై నమ్మకం ఉంచి నాలుగోసారి సీట్‌ ఇచ్చినందుకు అర్జున్ రామ్ మేఘ్వాల్ బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే లోక్‌ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు, ఒక పారాలింపియన్ ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మహేంద్రజిత్ మాల్వియా, జ్యోతి మిర్ధాలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది.  మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు, సిట్టింగ్ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు కూడా పార్టీ ఝలావర్ బరన్ నుంచి మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)