Breaking News

బీజేపీలో ముసలం.. పార్టీ ఎమ్మెల్యేకు హైకమాండ్‌ షోకాజ్‌నోటీసులు

Published on Mon, 12/02/2024 - 11:31

బెంగళూరు: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్‌గా తయారైంది. పార్టీలో అంతర్గత విబేధాల నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా బసనగౌడ, విజయేంద్ర వివాదంపై బీజేపీ హైకమాండ్‌ జోక్యం చేసుకుంది. ఈ మేరకు బసనగౌడ యత్నాల్‌కు షోకాజ్‌ నోటీసులు అందించింది. పార్టీ సిద్దాంత వ్యతిరేక వ్యాఖ్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేకుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

‘రాష్ట్ర స్థాయి పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా యత్నాల్ ప్రవర్తిస్తున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, బహిరంగ ప్రకటనలు చేయడం ఆందోళన కలిగించే విషయం. యత్నాల్ వైఖరి రాజకీయ, ప్రజా ప్రాముఖ్యత ఉన్న అన్ని విషయాలపై పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉంది.  

పార్టీ నాయకులపై మీరు చేసిన తప్పుడు, ఆరోపణలు పార్టీ క్రమశిక్షణను తీవ్రంగా ఉల్లంఘించడమే. మీ చర్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. లేనిపక్షంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది’ అని షోకాజ్ నోటీసులో పేర్కొంది. 

కాగా విజయేంద్రపై బసనగైడ తరుచూ విమర్శలు చేస్తున్నారు. విజయేంద్ర ఆయన వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని,పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమయ్యారని ఆరోపించారు. ఈ  క్రమంలోనే హైకమాండ్‌ చర్యలు చేపట్టింది. 

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక, తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

క్రమశిక్షణా నోటీసులపై స్పందించిన యత్నాల్‌.. పార్టీ నోటీసులకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు. కర్ణాటకలో పార్టీ ప్రస్తుత స్థితిని కూడా తెలియజేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వంతో విజయేంద్ర భేటీ అయిన నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడ్డాయి. రాజకీయ లబ్ధి కోసం యత్నాల్‌ తనపై, తన తండ్రి బీఎస్‌ యడియూరప్పపై నిత్యం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని  విజయేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)