Breaking News

ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ

Published on Tue, 01/02/2024 - 15:34

ఢిల్లీ: బీజేపీలో చేరే ఇతర పార్టీల నేతల నాణ్యతను చెక్ చేసేందుకు బీజేపీ నూతన కమిటీని నియమించింది. పార్టీలో చేరాలనుకునే నేతలను అనుమతించాలా? తిరస్కరించాలా? అనేదానిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆ కమిటీయే నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ జనవరి 6న తొలిసారి సమావేశం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీకి విధేయులుగా లేని నాయకులు చేరే ప్రమాదాన్ని తగ్గించేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ముకుల్ రాయ్, బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చింది. 

దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలో రావడానికి సన్నద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా లోటుపాట్లను సమీక్షిస్తోంది. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా గెలుపొందడానికి ఎన్నికల ప్రచారాలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేస్తున్నారు.  

లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనపై చర్చించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ఈరోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ ఉన్నారు. 

ఇదీ చదవండి: మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)