Breaking News

‘ఆరు గ్యారంటీ’లతో మోసగించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది

Published on Wed, 09/20/2023 - 04:04

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు 6 గ్యరంటీలు అంటూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ సభలో రాహుల్‌ గాంధీ సహా ఇతర నాయకులు అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ ఆరు గ్యారంటీ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

పార్టీనేతలు మాఘం రంగారెడ్డి, మాజీ మేయర్‌ బండా కార్తీక రెడ్డి, సీహెచ్‌ విఠల్, రాకేశ్‌రెడ్డి, జె.సంగప్పలతో కలిసి అరుణ మంగళవారం మీడియాతోమాట్లాడారు. ఒక సాధారణ వ్యక్తి దేశ ప్రధాని కావడం, మోదీ నాయకత్వంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుండటాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందన్నారు. గాంధీ పేరు పెట్టుకుని రాజకీయాలు చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోవడంతో మతఘర్షణలతో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు.   

కవిత లేఖతో బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదమని అరుణ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు కనీసం 15% రిజర్వేషన్‌ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. పేదలకు ఇళ్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వ నిధులతోనా లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.   

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం 
నూతన పార్లమెంటు భవనంలో తొలిబిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పెట్టినందుకు బీజేపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి డీకే అరుణ ఆధ్వర్యంలో నేతలు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి, మహిళానేతలు ఆకుల విజయ, బండా కార్తీకారెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)