Breaking News

రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపిక

Published on Tue, 03/03/2026 - 15:36

ఢిల్లీ: ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్‌ నబీన్‌ను రాజ్యసభకు పంపనుంది పార్టీ అధిష్టానం.  ఈ మేరకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. బిహార్‌ నుంచి నితీన్‌ నబీన్‌తో పాటు శివేష్‌ కుమార్‌లను రాజ్యసభకు ఎంపిక చేసింది. వీరిద్దరితో పాటు మిగతా వారి వివరాలు ఇలా ఉన్నాయి. 

  • అస్సాం నుంచి తేరాష్ గోవాలా,జోగెన్ మోహన్
  • ఛత్తీసగఢ్ నుంచి  లక్ష్మి వర్మ
  • హర్యానా సంజయ్ భాటియా
  • ఒడిశా నుంచి నుంచిమన్మోహన్ సామల్, సుజిత్ కుమార్
  • పశ్చిమ బెంగాల్  నుంచి రాహుల్ సిన్హా

సొంత రాష్ట్రమైన బిహార్‌ నుంచి నితిన్‌ నబీన్‌..
ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్‌ నబీన్‌ ఇన్నాళ్లూ బిహార్‌లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు.

 అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే ఆయనను ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపారు. వచ్చే ఏప్రిల్‌లో బిహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనిలో భాగంగానే రాజ్యసభ సభ్యుల ఎంపికను షురూ చేసింది బీజేపీ. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)