Breaking News

‘పంచాయతీ ఎన్నికల వాయిదా కోసం కాంగ్రెస్‌ కొత్త డ్రామాలు’

Published on Fri, 07/12/2024 - 16:22

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ఏమీ మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.

కాగా, నేడు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం, రఘునందన్‌ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశాం. రైతులకు రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రూప్‌-1 పోస్టుల్లో అదనంగా కేవలం 60 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు 30 రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటు.

కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు. డీఎస్సీ ఒక నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. మేము వారికి మద్దతు ఇస్తున్నాము. నెలకు నాలుగు లక్షల నెల జీతం ఏడు మాసాలుగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?. అధికారులను అరెస్ట్ చేస్తున్నారు.. పనులు చేయించిన అప్పటి మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. ఒక్కో మంత్రి ఒక్కో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.

ధరణి పరిస్థితి ఏంటి?. ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గత ప్రభుత్వ పెద్దలు తిన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చడానికి, మంత్రి పదవులు భర్తీ కోసం ఢిల్లీకి వారం రోజులుగా వెళ్లున్నారు. పంచాయతీల కాల పరిమితి ముగిసింది. వెంటనే ఎన్నికలు జరపాలి. కులగణన త్వరితగతిన పూర్తి చేయాలి. ఎన్నికలు వాయిదా వేసేందుకు డ్రామాలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు నెలకు 1200 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. ఆ  ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)