Breaking News

సర్వేలు అదే చెబుతున్నాయి: ఎంపీ లక్ష్మణ్‌

Published on Wed, 04/17/2024 - 20:02

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. సర్వేలు సైతం బీజేపీ గెలుపును ధృవీకరిస్తున్నాయని చెప్పారు. 247 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 235 స్థానాల్లో ఓడిపోబోతుందంటూ జోస్యం చెప్పారు.

‘‘కాంగ్రెస్ పార్టీ నేలా విడిచి సాము చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయినట్లు కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు. రెండు అంకెల సీట్లు బీజేపీకి రావడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డూప్ ఫైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పస లేని విమర్శలు చేస్తున్నారు. అభద్రతా భావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గత చరిత్రగానే మారిపోతోంది. ఆడలేక మద్దెల చెరువు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే అసెంబ్లీ సీటు బీజేపీ సాధించగా... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు గెలిచింది. తెలంగాణలో నాలుగు సీట్లు గెలవడంతోనే బీజేపీ సీట్ల సంఖ్య 300 మార్క్ దాటింది’’ అని లక్ష్మణ్‌ తెలిపారు.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)