మోదీని విమర్శించే రేవంత్ ఎమర్జెన్సీపై మాట్లాడాలి: డీకే అరుణ

Published on Wed, 06/25/2025 - 13:08

సాక్షి, నల్లగొండ: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. జూన్ 25 దేశ చరిత్రలో చీకటి రోజు అని అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి అని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు అని ఎద్దేవా చేశారు.

నల్లగొండలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ..‘ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి అందరికీ తెలియాలి. ఆర్టికల్-352ను ఇందిరా గాంధీ దుర్వినియోగం చేశారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. ఎంతో మంది ప్రతిపక్ష నేతలను, లక్షల మందిని జైలుకు పంపించారు. కాంగ్రెస్ తన అజెండాను దేశంపై రుద్దేందుకు రాజ్యాంగ సవరణలు చేపట్టింది. ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఏబీవీపీ నేతలను జైళ్లలో వేసి హింసించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.

విదేశాల్లో దేశం, ప్రధాని మోదీ గురించి అవహేళనగా మాట్లాడటం రాహుల్ అవివేకం. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తి‌ ఏంటో చూపించాం. ప్రధానిని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి. ఎన్నికల‌ ముందు అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. రైతు భరోసా పేరుతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియదు. రెండు ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా రాలేదు. ఫోన్ ట్యాపింగ్‌లో బీజేపీ నాయకులందరూ బాధితులే. ఫోన్ ట్యాపింగ్‌పై ఇంత వరకు ఎందుకు చర్యలు లేవు?. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? అని ప్రశ్నించారు. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)