Breaking News

ఆ మాటలకు స్పీకర్‌ నవ్వడం మరింత బాధాకరం: బండి సంజయ్‌

Published on Fri, 01/02/2026 - 22:15

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీపై కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్‌ వేదికగా బండి సంజయ్‌ మండిపడ్డారు. 

‘దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయింది.  ఇందుకు ఇలాంటి బాధ్యతలేని, అసభ్య భాషే  ప్రధాన కారణం. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ నవ్వడం బాధాకరం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. 

మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ దూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. తక్షణమే ఈ  వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దేశ ప్రజలకూ, గౌరవ ప్రధానికీ నిస్సందేహంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. 

 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)