Breaking News

రైతు రుణమాఫీ.. కాంగ్రెస్‌ సంబురాలు దేనికి?: బండి సంజయ్‌ ఫైర్‌

Published on Thu, 07/18/2024 - 19:19

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారి బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు రైతులతో కలిసి సంబురాలు చేసుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్‌ సంబురాలపై బీజేపీ ఎంపీ సంజయ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

రైతుల రుణమాఫీపై బండి సంజయ్‌ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘ఏం సాధించారని కాంగ్రెస్‌ పార్టీ సంబురాలు చేసుకుంటుంటోంది. రబీ, ఖరీఫ్‌లో రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా?’ అని నిలదీశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు ఈరోజులు రుణమాఫీ జరిగింది. వారి బ్యాంక్‌ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మరో విడతల్లో రూ.రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ చెప్పారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)