Breaking News

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఆ వీడియో చూస్తూ అడ్డంగా బుక్‌..!

Published on Thu, 03/30/2023 - 18:28

అగర్తల: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ సెషన్‌ జరుగుతుండగా ఆయన ఫోన్లో అశ్లీల వీడియోలు చూసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

జాదవ్ లాల్ నాథ్ బాగ్‌బస్సా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్లో వీడియోలు చూస్తూ కన్పించారు. ఈ క్రమంలోనే ఓ ఆశ్లీల వీడియోను చూస్తున్న సమయంలో వెనకాల ఉన్న సభ్యులెవరో రికార్డు చేశారు. అది బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది.
చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా..

ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇవ్వాలని జాదవ్‌కు సమన్లు పంపింది. అయితే ఆయన మాత్రం ఇంకా వీటిపై స్పందించలేదు. అసెంబ్లీ సెషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

బీజేపీ నేతలు అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూడటం ఇది తొలిసారేం కాదు. 2012లో కూడా కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు మంత్రులు లక్ష‍్మణ్ సవాది, సీసీ పాటిల్.. అశ్లీల వీడియోలు చూస్తూ కన్పించారు. అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే బీజేపీ దీనిపై విచారణ జరిపి వారు తప్పుచేయలేదని నిర్ధరించుకున్న తర్వాత తిరిగి మంత్రి పదువులు ఇచ్చింది.
చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్‌ నేతపై లలిత్ మోదీ ఫైర్..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)