Breaking News

ఇది హామీలకు పాతరేసే బడ్జెట్‌

Published on Sat, 03/22/2025 - 05:34

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలకు పాతరేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం శాసనసభలో జరిగిన సాధారణ చర్చలో మహేశ్వర్‌రెడ్డి బడ్టెట్‌ తీరుతెన్నులను ఎండగట్టారు. ఇది కమీషన్ల ప్రభుత్వమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడతాయని భావిస్తే అప్పుల కుప్పగా చేశారు. గత పాలకుల అవినీతిని కక్కిస్తామని హడావుడి చేసి 14 నెలలుగా ఎవరిపైనా కేసులు, రికవరీలు లేవు. ఆరు గ్యారంటీలకు నిధుల కేటాయింపు అసమగ్రంగా ఉంది.

అనేక పథకాలకు వరుసగా రెండో బడ్జెట్‌లోనూ ఎలాంటి కేటాయింపులు లేవు. కేవలం ఏడాదిన్నరలోపే రూ.1.63 లక్షల కోట్లు అప్పు తెచ్చి పురోగతి ఎలా సాధ్యమో చెప్పాలి. రుణమాఫీకి రూ.42వేల కోట్లు అవసరం కాగా, రేవంత్‌ కటింగ్‌ మాస్టర్‌ అవతారం ఎత్తి రూ.29వేల కోట్లు ఎగవేశారు. మూసీ ప్రక్షాళనపై డీపీఆర్‌లో అంచనాలు పెంచుతూ జేబు నింపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ భారతి మార్గదర్శకాలు విడుదల చేయడంతోపాటు ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలి.

రూ.2.50 లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైనట్టు గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ వివరాలు బయట పెట్టాలి. రాజీవ్‌ యువ వికాసం కింద 35 లక్షల మంది యువత ఉంటే 10 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు. పదిశాతం జనాభా ఉన్న మైనారిటీ బీసీలకు రూ.3,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందూ బీసీలకు రూ.11వేల కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేస్తోంది’అని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న తనను స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నిర్మల్‌ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న పామాయిల్‌ ఫ్యాక్టరీతో ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్లండి.. కలిసివస్తాం : ఏలేటికి మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌ 
రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి నిధుల సాధనకు చర్చించేందుకు పీఎం నరేంద్రమోదీ దగ్గరకు తీసుకెళ్లాలని, తాము ఎలాంటి భేషజాలు లేకుండా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయరమణారావుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.  హామీల అమలు పక్కన పెట్టి..మూసీ ప్రాజెక్టు ఎందుకు ముందు వేసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని పెద్దలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)