Breaking News

13 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు స్పెషల్‌ డ్రైవ్‌

Published on Sat, 10/12/2024 - 04:47

సాక్షి, హైదరాబాద్‌: సభ్యత్వ నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీతో రాష్ట్రస్థాయిలో సభ్యత్వ నమోదు ముగించాల్సి ఉంది. సభ్యత్వ నమోదు టార్గెట్‌ 50 లక్షలు కాగా, శుక్రవారం నాటికి రాష్ట్రంలో 20 లక్షల మంది (5 లక్షల దాకా మిస్డ్‌కాల్‌తో నమోదు, అసంపూర్తి వివరాలు) పార్టీ సభ్యులుగా చేరినట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సభ్యుల్లో 15 లక్షల మంది పూర్తి వివరాలు నమోదు చేయగా, మిగతా వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉన్నట్టుగా తేలింది. దీంతో దసరా పండుగ తర్వాతి మూడురోజులు ‘స్పెషల్‌ డ్రైవ్‌’పేరుతో సభ్యత్వ నమోదు ఉధృతంగా చేపట్టాలని బీజేపీ ముఖ్యనేతలు నిర్ణయించారు. 

ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రంలోని 36 వేల పోలింగ్‌ బూత్‌లలో ఒక్కోదాంట్లో కనీసం వంద మంది సభ్యులను చేరి్పంచడం ద్వారా మరో పది లక్షలకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.  ఈ నెల 15 తర్వాత వంద మంది సభ్యులను చేరి్పంచిన వారితో క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తారు. క్రియాశీల సభ్యులుగా ఉన్నవారే పార్టీ బూత్, మండల, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. 

నవంబర్‌ 15 నాటికి ‘యాక్టివ్‌ మెంబర్‌íÙప్‌’పూర్తయ్యాక, ఆ తర్వాత బూత్‌ కమిటీల ఎన్నిక, ఆపై మండల అధ్యక్షులు, మళ్లీ వారు జిల్లా అధ్యక్షులను, ఆ తర్వాత వారంతా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల మంది ఓటు వేయగా, ఈ ఓట్లలో 75 శాతం అంటే 50 లక్షల దాకానైనా సభ్యులుగా చేర్పించేలా ప్రయతి్నంచాలని బీజేపీ హైకమాండ్‌ టార్గెట్‌ పెట్టింది. సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ సభ్యత్వ ఇన్‌చార్జ్‌ అభయ్‌ పాటిల్, రాష్ట్రపార్టీ సభ్యత్వ కార్యక్రమ కనీ్వనర్‌ ఎన్‌.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి