Breaking News

నాంపల్లి బీజేపీ ఆఫీసు వద్ద హైటెన్షన్‌..

Published on Sun, 08/31/2025 - 12:14

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. మహిళా నేతలు గేట్లు ఎక్కి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వివరాల ప్రకారం.. బీహార్‌ ఎన్నికల్లో ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ పేరుతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ యాత్రలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో, పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు నేతలను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు.

మరోవైపు.. కాసేపటి క్రితమే బీజేపీ మహిళా మోర్చా నేతలు బీజేపీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా నిరసనలకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గేటు మీద నుంచి దూకి నిరసన తెలిపేందుకు బీజేపీ మహిళా నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)