Breaking News

'వారి ప్రాణాలు తీయడానికి వెనకాడబోం' బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Published on Sun, 08/06/2023 - 19:44

భోపాల్‌: బీజేపీ సీనియర్‌ నాయకుడు కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ప్రేమించేవాళ్లందరూ తమ సోదరులేనని అన్నారు. అలాగే.. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడబోమని వ్యాఖ‍్యానించారు. బాంగ్రోట్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

' మేము ఎవరికీ ప్రత్యర్థులం కాదు. భారత మాతా కీ జై అనేవారందరూ మా సోదరులే. వారికోసం మా ప్రాణాలను త్యజించడానికి ముందుంటాం. కానీ భారత మాతకు వ్యతిరేకుల ప్రాణాలు తీయడానికి మాత్రం అస్సలు వెనకాడబోము' అని కైలాష్ విజయవర్గీయ మాట్లాడారు. 

రామ మందిరంపై మాట్లాడిన ఆయన కాంగ్రెస్ స్వభావంపై నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో రామ మందిరం ఎప్పుడు అవుతుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటివారందరూ వచ్చే జనవరిలో ప్రారంభం కాబోతున్న అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని పాప పరిహారం చేసుకోవాలని హితువు పలికారు. 

ఈ సందర్భంగా కైలాష్ విజయవర్గీయ కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కాశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణను అందరం గుర్తించాలని అన్నారు. కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, ఇంతకు ముందు ఉన్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. 

#

Tags : 1

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)