‘భారత్‌’గా పేరు మార్పు రాజ్యాంగబద్ధమే!

Published on Thu, 09/07/2023 - 00:48

సాక్షి, హైదరాబాద్‌: దేశం పేరును ‘భారత్‌’గా మార్చడమనేది రాజ్యాంగబద్ధమేనని రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, ఎంపీ ప్రకాశ్‌ జవదేకర్‌ వ్యాఖ్యా నించారు. భారత్‌ అనేది ఈ దేశం అసలు (ఒరిజినల్‌) పేరు అని స్పష్టం చేశారు. బుధవారం జవదేకర్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోనూ ఇదే రాసి ఉందని దానికి లోబడే పేరు మార్పు జరుగుతోందన్నారు.

శతాబ్దాలుగా ఎవరు ముందుగా దేశాలను ఆక్రమించినా వాటి పేర్లను మార్చడం జరిగిందనీ, సుదీర్ఘ చరిత్ర ఉన్న అమెరికాలోనూ ఇది చోటుచేసుకుందని చెప్పారు. ఇక్కడికి బ్రిటీషర్లు వచ్చాక తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు...కోల్‌కతా పేరును కలకత్తాగా, చెన్నైను మద్రాస్‌గా, తిరువనంతరం పేరును ట్రివేండ్రం, ముంబైను బాంబేగా మార్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు గతంలోని వలసవాద భావజాలం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

పేరు మార్పునకు, ఎన్నికలకు సంబంధం లేదు
దేశం పేరుమార్పు అంశానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని జవదేకర్‌  పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో సనాతన ధర్మాన్నే కాకుండా దేశ ప్రజలను, అన్ని ధర్మాలను అవమానించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వెంటనే క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని జవదేకర్‌ డిమాండ్‌ చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కూడా ఎందుకు మౌనం వహించారో చెప్పాలని నిలదీశారు. ఈ విధంగా సనాతన ధర్మాన్ని అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకి ఆమోదమేనా అని ప్రశ్నించారు.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)