మహారాష్ట్రలో బీజేపీలో ట్విస్ట్‌.. పంకజా ముండే సంచలన కామెంట్స్‌

Published on Fri, 07/07/2023 - 21:22

ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. అజిత్‌ పవార్‌ వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక, పవార్‌ వర్గం బీజేపీ కూటమితో చేరడం పట్ల మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న ఎన్సీపీ నేతలను ఇప్పుడే పక్కనే కూర్చోబెట్టుకోవాలన్న కారణంగా తమ అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కతున్నారు. 

ఈ క్రమంలో  బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, పంకజ్‌ ముండే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అజిత్‌ పవర్‌ వర్గం ప్రభుత్వంలో చేరడంపై చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. అవినీతి ఆరోపణలున్న ఎన్సీపీ నేతలు ప్రభుత్వంలో చేరడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే తాను రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలపై సీరియస్‌ అయ్యారు. 

తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను పంకజా ముండే ఖండించారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తాను కలిసినట్లు ప్రసారం చేసిన ఛానెల్‌పై పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వదంతులు ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. బీజేపీ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడం వల్లనే ఇలాంటి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై బీజేపీ హైకమాండ్‌ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ సిద్ధాంతం తన రక్తంలో ఉందన్నారు. సిద్ధాంతాల విషయంలో రాజీపడాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నానని సంచలన కామెంట్స్‌ చేశారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశానని, అయినా తన నీతిని ప్రశ్నిస్తున్నారని, పుకార్లు పుట్టిస్తున్నారని పంకజా ముండే ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయాలపై గడ్కరీ అదిరిపోయే సెటైరికల్‌ పంచ్‌

Videos

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)