Breaking News

సీఎం రేవంత్‌కు కేసీఆర్‌ గతే పడుతుంది

Published on Sun, 04/14/2024 - 06:06

సాక్షి, ఆదిలాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ గతే పడుతుందని బీజేపీ జాతీయ నాయకుడు పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌ పి.ము రళీధర్‌రావు హెచ్చరించారు. గతంలో కేసీఆర్‌ మాట్లాడినట్లే ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చాలా తక్కువ సమయంలోనే సీఎం పదవిని కోల్పోతారన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన బీజేపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పోలింగ్‌ బూత్‌ ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ఏటీఎం సెంటర్‌ అయిందని, ఇక్కడి నుంచి పంపించిన 2 వేల కోట్ల రూపాయలనే పార్టీ ప్రచారం కోసం వినియోగిస్తోందని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో ప్రవేశించేందుకు హస్తం పార్టీకి గ్యారంటీ లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే పనికి రాకుండా పోతుందని చెప్పారు. దేశం నడవాలంటే స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉండాలని అందుకు మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుస్తుందంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఒక వేళ గెలుచుకోకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

సీఎం రేవంత్‌రెడ్డి సెటిల్మెంట్ల కోసమే పదవిలో కూర్చున్నారని వాటికి సంబంధించి ఆధారాలతో నిరూ పిస్తానని..బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ అభ్యర్థి గోడం నగేశ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌బాబు ఇతర నేతలు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)