Breaking News

వారిది ముక్కోణపు ప్రేమ కథ!

Published on Thu, 07/27/2023 - 04:43

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలది ముక్కోణపు ప్రేమ కథ (ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ) అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, మూడూ కుటుంబ, అవినీతి పార్టీలేనని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పేరిట ఢిల్లీలో ఈ మూడు పార్టీలు ఆడుతున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘ఈ పార్టీలు గతంలో కలిశాయి.. ఇప్పుడూ కలిశాయి.. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాయి..’ అని అన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.  

ఒకే తాను ముక్కలే.. 
‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకే తాను ముక్కలే. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా మూడు పార్టీలకు వేసినట్లే. బీజేపీ ఈ మూడు పార్టీలతో గతంలో కలవలేదు. భవిష్యత్తులోనూ కలవదు. ఈ మూడు పార్టీలపై పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్రంలో మార్పు రావాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే మోదీ నాయకత్వంలోని బీజేపీతో మాత్రమే సాధ్యం..’ అని కిషన్‌రెడ్డి అన్నారు.  

తెలంగాణలో 4 వేల కిసాన్‌సేవా కేంద్రాలు 
దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల రిటైల్‌ షాపులను గురువారం నుంచి ‘ప్రధానమంత్రి కిసాన్‌ సేవా కేంద్రాలు’గా మార్చుతున్నట్టు కిషన్‌రెడ్డి  చెప్పారు. ఒకే దేశం.. ఒకే ఎరువు అనే నినాదంతో, భారత్‌బ్రాండ్‌పేరుతో గురువారం నుంచి ఎరువుల సరఫరా అమల్లోకి రానున్నట్టు తెలిపారు. దేశంలో 2.8 లక్షల దుకాణాలను కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా అప్‌ గ్రేడ్‌ చేస్తామని అన్నారు. తొలిదశలో 1.25 లక్షల షాప్‌లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణలో సుమారు 4 వేల ఎరువుల రిటైల్‌ షాపులు కిసాన్‌సేవా కేంద్రాలుగా మారతాయని చెప్పారు. ఈ మేరకు శామీర్‌పేటలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు.  

 ప్రతి నెల రెండో ఆదివారం ‘కిసాన్‌ కీ బాత్‌’ 
రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకేచోట అందించేందుకు వీలుగా ఎరువుల రిటైల్‌షాపులను ప్రధానమంత్రి కిసాన్‌సేవా కేంద్రాలుగా కేంద్రం మార్చుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎరువులు, భూసార, విత్తన పరీక్షల కోసం వేర్వేరు చోట్లకు రైతులు వెళ్లకుండా అన్ని రకాల సేవలు..ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో లభిస్తాయని వివరించారు.

సల్ఫర్‌ కోటెడ్‌ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, కిసాన్‌సమ్మాన్‌యోజన వంటి కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఏ పంట వేయాలి? ఏ ఎరువు వాడాలనే దానిపై రైతులకు ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయని చెప్పారు. రైతు సమస్యలపై ‘కిసాన్‌కీ బాత్‌’ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రతి నెల రెండో ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.  

నేడు రైతుల ఖాతాల్లోకి ‘కిసాన్‌ సమ్మాన్‌’ నిధులు 
14వ విడత పీఎం కిసాన్‌సమ్మాన్‌నిధులను గురువారం ఉదయం ప్రధాని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని సుమారు 39 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు.    

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)