Breaking News

‘సీఎం కేజ్రీవాల్‌ ఈడీ నుంచి తప్పించుకోలేరు’

Published on Sat, 12/30/2023 - 20:58

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీ చేసిన సమన్ల నుంచి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్​ తప్పించుకోలేరని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. అయితే  ఈడీ ఇప్పటికే  అరవింద్‌ కేజ్రీవాల్‌కు వరుసగా మూడుసార్లు సమన్లు జారీ చేసిన విసయం తెలిసిందే.

కాగా.. మూడోసారి జారీ చేసిన మమన్ల ప్రకారం కేజ్రీవాల్‌ 2024 జనవరి 3వ తేదీ ఈడీ ముందు హాజరుకావల్సి ఉంది. అరవింద్‌ కేజజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగానే ఈడీ ముందుకు రావటంలేదని వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. ముడోసారి జారీ చేసిన సమన్ల నుంచి మాత్రం కేజ్రీవాల్‌ ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని అన్నారు. 

మొదటిసారి ఎన్నికలు, రెండోసారి విపాశన ధ్యానం పేరుతో కేజ్రీవాల్‌ దూరంగా ఉన్నారని దుయ్యబట్టారు. జనవరి 3న హాజరుకావాలన్న ఈడీ సమన్లపై ఎలాంటి వివరణ ఇస్తారో చూస్తామని తెలిపారు. అయితే సుదీర్ఘం కాలం మాత్రం ఈడీ  సమన్ల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అన్నారు. కచ్చితంగా కేజ్రీవాల్‌ ఈడీ ముందుకు హాజరు కావాల్సిందేనని తెలిపారు.

ఇక సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మొదటిసారి నవంబర్‌ 2న, రెండోసారి డిసెంబర్‌18న, మూడోసారి డిసెంబర్‌ 21న సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం కేజ్రీవాల్‌ జనవరి 3న ఈడీ ముందుకు హాజరవుతారో? లేదో? అని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. 

చదవండి: ‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)