Breaking News

కేజ్రీవాల్‌ పాలనపై విమర్శలు.. అతిషికి అభినందనలు

Published on Sat, 09/21/2024 - 12:21

ఢిల్లీ: ఆప్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూనే.. ఢిల్లీకి కొత్త  సీఎంగా ఎంపికైన ఆప్‌ నాయకురాలు అతిషికి ప్రతిపక్ష బీజేపీ నేత హర్ష్ మల్హోత్రా అభినందనలు తెలిపారు. దశాబ్ద కాలం పాటు అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీని వేధించిన పలు కీలక సమస్యలకు పరిష్కరం చూపించాలని కోరారు. ఢిల్లీలో ఉన్న అవినీతిని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు.

‘‘గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజలకు అందని అభివృద్ధి, సౌకర్యాలు కనీసం మీ(అతిషి) నాయకత్వంలోనైనా అందేలా చూడాలి. జాతీయ రాజధాని అంతటా అపరిశుభ్రమైన మురుగు, విస్తృతమైన నీటి ఎద్దడి, నిరంతర సమస్యలు ఉన్నాయి.ఈ సమస్యల ముఖ్యమంత్రిగా పరిష్కారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

ఇదిలాఉండగా.. అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడే ప్రయత్నాలకు అతిషి కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారని ఇటీవల ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను హర్ష్‌ మల్హొత్రా ప్రస్తావిస్తూ.. అలాంటి వారికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై అతిషి , కేజ్రీవాల్ ఆలోచించాలన్నారు.

మరోవైపు.. అతిషి ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)