Breaking News

పవర్‌లోకి వస్తామని కాంగ్రెస్‌ పగటి కలలు

Published on Mon, 06/19/2023 - 01:24

సాక్షి, హైదరాబాద్, సాక్షి, నాగర్‌కర్నూల్, కొత్తపల్లి  (కరీంనగర్‌): తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నాయకులు పగటి కలలు కంటున్నారని, అప్పుడే గాలిలో మేడలు కడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా పరాజయం పాలైన విషయాన్ని వారు సులభంగా మరిచిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అంటే టెయింటెడ్‌ పొలిటీషియన్స్‌ ఆఫ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌.. అని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని సామాజిక భద్రతా పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గతంలోని లోటుపాట్లను తొలగించి మరింత మెరుగ్గా అవి అమలయ్యేలా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్‌ వేదికగా సంజయ్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే ధరణి, సంక్షేమ పథకాలు, పెన్షన్లు వంటి వాటిపై రాష్ట్ర ప్రజల్లో అనిశ్చితి, అయోమయం రేకెత్తించే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ నిమగ్నమైతే... మరోవైపు బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు రద్దవుతాయంటూ సీఎం కేసీఆర్‌ ప్రజల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కేసీఆర్‌ సర్వేలోనే బీఆర్‌ఎస్‌కు 30 స్థానాలు 
కేసీఆర్‌ నిర్వహించిన సర్వేలోనే బీఆర్‌ఎస్‌కు 30 స్థానాలకు మించి రావని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ గెలవాలనే సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నారని సంజయ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. గుంట నక్కలే గుంపులుగా వస్తాయని, బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని బండి స్పష్టం చేశారు.

బీజేపీ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఆదివారం టిఫిన్‌ బైటక్‌లో బండి సంజయ్‌ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ :రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా దుస్తులపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించిన తీరు అవమానకరమన్నారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)