Breaking News

25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

Published on Thu, 06/15/2023 - 05:53

కుత్బుల్లాపూర్‌: అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, తమ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో బుధవారం గాజులరామారంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర ఇంచార్జి తరున్‌చుగ్, బండి సంజయ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మిలాఖత్‌ అయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 30 మంది బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గెలవరని తెలుసుకున్న కేసీఆర్‌... కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 30 మంది అభ్యర్థులకు డబ్బులు వెచ్చించాలని భావిస్తూ ఇప్పుడే కుట్రలకు తెర లేపారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. కేసీఆర్‌ ఎలాగైనా రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టేందుకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.

దేశం కోసం.. ధర్మం కోసం.. సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని, తెలంగాణ రాష్ట్రంలో నిజాం, రజాకార్ల పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. బహిరంగ సభలో ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మేడ్చల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాల అధ్యక్షులు హరీష్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)