Breaking News

ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్‌!

Published on Sun, 09/15/2024 - 16:16

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్‌ విజ్‌ అన్నారు. అయితే ఇప్పటికే హర్యానాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్‌ విజ్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంబాల కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న అనిల్‌ విజ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు.

‘‘ నేను ఇప్పటి వరకు పార్టీ  నుంచి ఏం ఆశించలేదు. కానీ ఈసారి మాత్రం నా సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని నేను హర్యానాకు సీఎం కావాలనుకుంటున్నా. రాష్ట్రంలోని నలుమూలల నుంచి నన్ను కలవడానికి వస్తున్నారు.  అంబాల ప్రజలు కూడా నేను చాలా సీనియర్ నేతను అని.. నేను ఎందుకు ముఖ్యమంత్రి  కావొద్దని అడుగుతున్నారు.  ప్రజల డిమాండ్‌, నా సీనియార్టి ఆధారంగా ఈసారి కచ్చితంగా నేను హర్యానా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా. నాకు పార్టీ అధిష్టానం ఈసారి  సీఎంగా అవకాశం కల్పిస్తే..   హర్యానా ముఖచిత్రాన్ని మార్చివేస్తాను’’ అన్నారు. 

హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  అక్టోబర్‌ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.  ఇక.. సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలో  హర్యానాలో బీజేపీ మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఫోకస్ పెట్టింది.

చదవండి:   తమిళ ప్రజలకు రాముడు తెలియకుండా చేశారు: గవర్నర్‌ రవి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)