Breaking News

ముఖ్యమంత్రిపై పోటీ.. 8 మంది రెబల్స్‌పై వేటు

Published on Mon, 09/30/2024 - 07:14

న్యూఢిల్లీ: అక్టోబరు 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్యానా బీజేపీ ఎనిమిది మంది రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీతో సహా ఇతర బీజేపీ నాయకులపై పోటీ చేసేందుకు రెబల్స్‌ ఇండిపెండెంట్‌లుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అధిష్టానం వారిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ జాబితాలో మాజీ మంత్రి రంజిత్ చౌతాలా సైతం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి బంగపడ్డ చౌతాలా తన పదవికి రాజీనామా చేశారు. లాడ్వా నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన సందీప్ గార్గ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.

బహిష్కరణకు గురైన ఇతర ఆరుగురు నాయకులు అసంధ్ స్థానం నుండి పోటీ చేస్తున్న జిలే రామ్ శర్మ, సఫిడో నుండి మాజీ మంత్రి బచన్ సింగ్ ఆర్య, మెహమ్ నుండి రాధా అహ్లావత్, గుర్గావ్ నుండి నవీన్ గోయల్, హతిన్ నుండి కెహర్ సింగ్ రావత్, మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర కద్యన్ ఉన్నారు.

రంజిత్ చౌతాలా స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన రానియా నుండి ఎన్నికల టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.  

రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)