Breaking News

కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ గతే.. మంత్రులకు కాల్‌ చేస్తే తీయలేదు: ఈటల ఫైర్‌

Published on Mon, 07/08/2024 - 21:25

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేటర్‌ కాంగ్రెస్‌లో చేరడంలేదని అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్‌ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం అంటూ కామెంట్స్‌ చేశారు.

​కాగా, ఈటల రాజేందర్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేస్తోంది. ఫిరోజ్‌గూడలో సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు. స్థానిక కార్పొరేటర్‌ కాంగ్రెస్‌లో చేరడంలేదని ఇళ్లను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం.

అవి అక్రమ భూములు అయితే ఇన్ని రోజులు ఎందుకు కూల్చివేయలేదు. ప్రభుత్వ అధికారులు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలి. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు గురిచేయడం సరైన పద్దతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా పేదలు రోడ్డున పడ్డారు. కేసీఆర్‌ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే అధికారం కోల్పోయారు. ఈ సమస్యపై మాట్లాడటానికి అధికారులు, మంత్రులకు ఫోన్‌ చేస్తే వారు మాట్లాడటం లేదు. మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటికి ఫోన్‌ చేసినా వారు లిఫ్ట్‌ చేయలేదు. ప్రభుత్వ చర్యలను కచ్చితంగా అడ్డుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)