Breaking News

బీఆర్‌ఎస్‌కు డీకే అరుణ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Wed, 10/04/2023 - 21:16

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో​ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున కొద్దీ పొలిటికల్‌ వాతావరణం రసవత్తరంగా మారుతోంది. ప్రధాని మోదీ నిజామాబాద్‌ బీజేపీ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత డీకే అరుణ.. బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, డీకే అరుణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వాస్తవాలు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నేతలే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రధానిని అవమానించేలా మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలంటేనే అసహ్యించుకునే పరిస్థితి తెచ్చారు. ప్రధాని మోదీపై ఇస్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రధాని మోదీపై కేసీఆర్ కుటుంబం అహంకారపూరిత మాటలు దుర్మార్గం. తెలంగాణ ఎవరి జాగీరు కాదు.‌. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికే.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. 

తెలంగాణకు ఈ 9 ఏళ్లలో కేంద్రం రూ.9 లక్షల‌ కోట్ల నిధులిచ్చింది. తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్. గెలిచినోళ్లను కాపాడుకోలేని కాంగ్రెస్.. ప్రజలకేమి గ్యారంటీ ఇస్తోంది?. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఓటుకు నోటు కేసులో పీసీసీ అ‌ధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండాలన్న హరీష్‌ రావు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)